Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

గోలేటిలో దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గోలేటిలో దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

వార్త ముఖ్యాంశాలు

  • రెబ్బెన: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెబ్బెన మండలం గోలేటిలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గాభవాని అమ్మవారిని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
  • దసరా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం మన సంప్రదాయమని, ఇలాంటి పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

రెబ్బెన: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెబ్బెన మండలం గోలేటిలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గాభవాని అమ్మవారిని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దసరా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం మన సంప్రదాయమని, ఇలాంటి పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కేసరి కిషన్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి దుర్గం రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు చెన్న సోమశేఖర్, ఇంద్ర ఫెలోషిప్ కోఆర్డినేటర్ కోవా ఇంద్ర విజయ, రెబ్బెన ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపాల్ నాయక్, మండల ఉపాధ్యక్షుడు బలరాం నాయక్, గంగాపూర్ టెంపుల్ డైరెక్టర్ అడప విమల, సీనియర్ నాయకులు సాంబ గౌడ్, ఇల్లూరి రాము, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఏలగల సాయికుమార్, స్థానిక ఉపసర్పంచ్ దుర్గం తిరుపతి, రెబ్బెన టౌన్ అధ్యక్షుడు దుర్గం రాజేష్, యువజన కాంగ్రెస్ వాంకిడి మండల అధ్యక్షుడు ఉప్పుల కృష్ణ, రెబ్బెన మండల ఉపాధ్యక్షుడు జటాంగుల సంజయ్, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రెబ్బెన రవి, యువజన కాంగ్రెస్ నాయకులు పార్వతి సాయి, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *