Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: TeluguNews

ASIFABAD

గోలేటిలో దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

రెబ్బెన: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెబ్బెన మండలం గోలేటిలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గాభవాని అమ్మవారిని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దసరా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం మన సంప్రదాయమని, ఇలాంటి పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కేసరి కిషన్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి దుర్గం రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు చెన్న సోమశేఖర్, ఇంద్ర ఫెలోషిప్ కోఆర్డినేటర్ కోవా ఇంద్ర విజయ, రెబ్బెన ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపాల్ నాయక్, మండల ఉపాధ్యక్షుడు బలరాం నాయక్, గంగాపూర్ టెంపుల్ డైరెక్టర్ అడప విమల, సీనియర్ నాయకులు సాంబ గౌడ్, ఇల్లూరి రాము, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఏలగల సాయికుమార్, స్థానిక ఉపసర్పంచ్ దుర్గం తిరుపతి, రెబ్బెన టౌన్ అధ్యక్షుడు దుర్గం రాజేష్, యువజన కాంగ్రెస్ వాంకిడి మండల అధ్యక్షుడు ఉప్పుల కృష్ణ, రెబ్బెన మండల ఉపాధ్యక్షుడు జటాంగుల సంజయ్, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రెబ్బెన రవి, యువజన కాంగ్రెస్ నాయకులు పార్వతి సాయి, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ASIFABAD

కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద 5.232 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, అక్టోబర్ 19: కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద రెబ్బెన పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 5.232 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2.70 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ వెల్లడించారు. గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 353/2026గా NDPS చట్టంలోని 8(c) r/w 20(B)(ii)(A) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరెస్టయిన వారిలో జుముర్ గెయిన్ (33), ఆమె భర్త సురంజన్ గెయిన్ (46) ఉన్నారు. వీరు ఈస్గాంలోని 11 నంబర్ ప్రాంతానికి చెందినవారు కాగా, ప్రస్తుతం కాగజ్‌నగర్‌లోని క్యూ.నెం.68లో నివసిస్తున్నారు. సురంజన్ గెయిన్ ఎస్‌పీఎం ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, జుముర్ గెయిన్ ఈ నెల 14న ఒడిశాకు వెళ్లి పింటూ అనే వ్యక్తి వద్ద రూ.15,000కు 5.232 కిలోల గంజాయిని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అనంతరం గంజాయితో కాగజ్‌నగర్‌కు తిరిగి వచ్చినట్లు తెలిపారు. ఆమె మంచిర్యాల వైపు ప్రయాణిస్తుండగా, భర్త సురంజన్ గెయిన్ స్కూటీపై ఆమె కోసం వేచి ఉండి గంజాయిని స్వీకరించి తమ నివాసానికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద తనిఖీలు చేపట్టిన రెబ్బెన పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి లభించింది. స్కూటీ నంబర్ TG20 A 1148తో పాటు రెండు మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి సరఫరా వ్యవహారంలో ఒడిశాకు చెందిన పింటూ (A3), మంచిర్యాలకు చెందిన మున్నీ (A4), జైపూర్‌కు చెందిన చంద్రశేఖర్ (A5), రాజు (A6) తదితరుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరికి సరఫరా చేయాల్సి ఉంది, అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్న ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, ఇన్‌చార్జ్ వాంకిడి సీఐ వేణుగోపాల్, రెబ్బెన ఎస్‌ఐ వెంకటకృష్ణ, పోలీస్‌స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ నితికా పంత్ అభినందించారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజా సమస్యలపై శాశ్వత పరిష్కారానికి చర్యలు

నెల్లూరు నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై.ఓ. నందన్ ప్రజల నుంచి మొత్తం 50 వినతులు స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా శాశ్వత పరిష్కారం అందిస్తామని మేయర్ తెలిపారు. నగరంలో రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. నవాబుపేట, మేకలమండి, మినీ బైపాస్, ఎన్టీఆర్ పార్కు ప్రాంతాల్లో ఆక్రమణల నివారణకు ప్రత్యేక కమిటీ ద్వారా చర్యలు చేపడతామన్నారు. వీధి వ్యాపారులు నిర్దేశించిన రోడ్డు మార్జిన్‌లోనే వ్యాపారం చేయాలని సూచించారు. నిర్మాణ సామగ్రి, వ్యర్థాలను రోడ్లపై వదలరాదని స్పష్టం చేశారు. నిర్మాణ వ్యర్థాలను నగరపాలక సంస్థ ద్వారా తరలించేందుకు 94940 18118 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్, ఆరోగ్య, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

క్రైమ్

బాలికల అక్రమ రవాణా కేసులో 33 మందికి శిక్షలు

బాలికల అక్రమ రవాణా కేసులో సంచలన తీర్పు: ఐదుగురికి జీవిత ఖైదు, మరో 28 మందికి వివిధ శిక్షలు విధించిన న్యాయస్థానం. తొమ్మిది మంది బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.