Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

ఇంద్రనగర్ కనకదుర్గాదేవి మహంకాళి ఆలయంలో ఆత్రం సుగుణక్క ప్రత్యేక పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇంద్రనగర్ కనకదుర్గాదేవి మహంకాళి ఆలయంలో ఆత్రం సుగుణక్క ప్రత్యేక పూజలు

వార్త ముఖ్యాంశాలు

  • రెబ్బెన: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెబ్బెన మండలం ఇంద్రనగర్ గ్రామంలోని స్వయంభు శ్రీ కనకదుర్గాదేవి మహంకాళి దేవస్థానాన్ని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క సోమవారం దర్శించుకున్నారు.
  • ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • ఆలయ అర్చకులు దేవర వినోద్ ఆమెకు అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు.

రెబ్బెన: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెబ్బెన మండలం ఇంద్రనగర్ గ్రామంలోని స్వయంభు శ్రీ కనకదుర్గాదేవి మహంకాళి దేవస్థానాన్ని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దేవర వినోద్ ఆమెకు అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ శరన్నవరాత్రులు దుర్గామాత మహిమను చాటిచెప్పే పవిత్రమైన పండుగలని, బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిషన్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి గౌడ్, చెన్నై సోమశేఖర్, స్థానిక సర్పంచ్ ధరావత్ అరుణ కృష్ణ, ఎస్సీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జాడి ప్రసాద్, ఇంద్ర ఫెలోషిప్ కోఆర్డినేటర్ కోవా ఇంద్ర విజయ, రెబ్బెన టౌన్ అధ్యక్షుడు దుర్గం రాజేష్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపాల్ నాయక్, మండల ఉపాధ్యక్షుడు బలరాం నాయక్, మాజీ ఎంపీటీసీ సీడం తిరుపతి, రెబ్బెన మండల కార్యదర్శి రాజేశ్వరి, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఏలగల సాయికుమార్, వాంకిడి మండల అధ్యక్షుడు ఉప్పల కృష్ణ, సీనియర్ నాయకులు ఇల్లూరి రాము, సంతోష్, జాడి తిరుపతి, సంతోష్ బాబు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *