గూడూరు: పట్టణంలోని రాజావీధిలో ఉన్న పలు బంగారం దుకాణాల్లో విజిలెన్స్, సేల్స్ ట్యాక్స్ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. బంగారం, వెండి నిల్వలు, కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని సుమారు రూ.8 కోట్ల విలువైన బంగారం, వెండి గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సమాచారం. దుకాణాల్లోని స్టాక్, పుస్తకాలు, బిల్లులు, ఇతర పత్రాలను అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. అధికారుల తనిఖీల విషయం తెలుసుకున్న పలువురు బంగారు వ్యాపారులు ముందుజాగ్రత్తగా దుకాణాలను మూసివేసినట్లు సమాచారం. సోదాలు, స్వాధీనం చేసుకున్న ఆభరణాలపై అధికారులు తదుపరి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

గూడూరులో బంగారం దుకాణాల్లో సోదాలు.. రూ.8 కోట్ల విలువైన బంగారం, వెండి సీజ్