Friday, 25 September 2026
  • Home  
  • గణనాథుల శోభాయాత్రకు ముస్తఫా నగర్‌లో స్వాగత వేదిక
- ఖమ్మం

గణనాథుల శోభాయాత్రకు ముస్తఫా నగర్‌లో స్వాగత వేదిక

ఖమ్మం నగర నలుమూలల నుంచి తరలివచ్చే గణనాథుల శోభాయాత్రకు ముస్తఫా నగర్‌లో ఘన స్వాగతం పలికేందుకు స్థంభాద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని నగరంలో ఉదయం 10 గంటల నుంచే వివిధ ప్రాంతాల నుంచి గణనాథుల ఊరేగింపులు, శోభాయాత్రలు ప్రారంభం కానున్నాయి. నగరంలోని ప్రధాన మార్గాల మీదుగా గణనాథుల శోభాయాత్రలు కొనసాగి ముస్తఫా నగర్ సెంటర్‌కు చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3.30 గంటలకు ముస్తఫా నగర్ సెంటర్‌లో సార్వజనిక గణేష్ నిమజ్జన వీడ్కోలు బహిరంగ సభ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు, వేదిక, ఇతర సౌకర్యాలను సిద్ధం చేశారు. గణనాథుల శోభాయాత్ర ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసారు

ఖమ్మం నగర నలుమూలల నుంచి తరలివచ్చే గణనాథుల శోభాయాత్రకు ముస్తఫా నగర్‌లో ఘన స్వాగతం పలికేందుకు స్థంభాద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని నగరంలో ఉదయం 10 గంటల నుంచే వివిధ ప్రాంతాల నుంచి గణనాథుల ఊరేగింపులు, శోభాయాత్రలు ప్రారంభం కానున్నాయి.

నగరంలోని ప్రధాన మార్గాల మీదుగా గణనాథుల శోభాయాత్రలు కొనసాగి ముస్తఫా నగర్ సెంటర్‌కు చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3.30 గంటలకు ముస్తఫా నగర్ సెంటర్‌లో సార్వజనిక గణేష్ నిమజ్జన వీడ్కోలు బహిరంగ సభ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు, వేదిక, ఇతర సౌకర్యాలను సిద్ధం చేశారు. గణనాథుల శోభాయాత్ర ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.