Thursday, 24 September 2026
  • Home  
  • క్రమశిక్షణ,సేవాభావంతో విధులు నిర్వర్తించాలి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్
- కడప

క్రమశిక్షణ,సేవాభావంతో విధులు నిర్వర్తించాలి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్

సిద్దవటం మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌లో ఈ నెల 26న నిర్వహించనున్న 548 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు సంబంధించి బుధవారం రిహార్సల్ నిర్వహించారు. ఈ రిహార్సల్‌ను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ పరిశీలించారు.ఈ సందర్భంగా శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల పరేడ్ కవాతు, డ్రిల్, మార్చింగ్, కమాండ్లకు అనుగుణంగా స్పందించే విధానం, క్రమశిక్షణ, సమన్వయం తదితర అంశాలను ఎస్పీ నిశితంగా పరిశీలించారు. పరేడ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరూ పూర్తి క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసంతో తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు.పోలీసు విధుల్లో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, బాధ్యత, నిబద్ధత, ప్రజాసేవా భావం ఎంతో ముఖ్యమని ఎస్పీ పేర్కొన్నారు. శిక్షణ సమయంలో నేర్చుకున్న నైపుణ్యాలను భవిష్యత్ విధుల్లో సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. పాసింగ్ అవుట్ పరేడ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. పరేడ్ సందర్భంగా భద్రత, క్రమశిక్షణ, కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.కార్యక్రమంలో 11వ బెటాలియన్ కమాండెంట్ ఆనంద్ రెడ్డి, కడప డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్, పోలీసు సిబ్బంది, శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

సిద్దవటం మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌లో ఈ నెల 26న నిర్వహించనున్న 548 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు సంబంధించి బుధవారం రిహార్సల్ నిర్వహించారు. ఈ రిహార్సల్‌ను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ పరిశీలించారు.ఈ సందర్భంగా శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల పరేడ్ కవాతు, డ్రిల్, మార్చింగ్, కమాండ్లకు అనుగుణంగా స్పందించే విధానం, క్రమశిక్షణ, సమన్వయం తదితర అంశాలను ఎస్పీ నిశితంగా పరిశీలించారు. పరేడ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరూ పూర్తి క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసంతో తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు.పోలీసు విధుల్లో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, బాధ్యత, నిబద్ధత, ప్రజాసేవా భావం ఎంతో ముఖ్యమని ఎస్పీ పేర్కొన్నారు. శిక్షణ సమయంలో నేర్చుకున్న నైపుణ్యాలను భవిష్యత్ విధుల్లో సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు.
పాసింగ్ అవుట్ పరేడ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. పరేడ్ సందర్భంగా భద్రత, క్రమశిక్షణ, కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.కార్యక్రమంలో 11వ బెటాలియన్ కమాండెంట్ ఆనంద్ రెడ్డి, కడప డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్, పోలీసు సిబ్బంది, శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.