డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ప్రోత్సాహక కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కోకో గార్డెన్స్, అగ్రి టూరిజం, కోకోపీట్ ఎగుమతులు, పీచు–చిప్పలతో విలువ ఆధారిత ఉత్పత్తులు, కొబ్బరి వ్యర్థాల పునర్వినియోగం వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బాల్ కొప్రాకు GI ట్యాగ్ సాధించే దిశగా చర్యలు, పరిశోధన–శిక్షణ–నూతన ఆవిష్కరణలకు ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటును పరిశీలించాలని తెలిపారు. రైతులకు అదనపు ఆదాయం, స్థానికంగా ఉపాధి అవకాశాలు, ఎగుమతుల విస్తరణే లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు.



