ఖమ్మం: ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది కొత్త క్రిమినల్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. కొత్త క్రిమినల్ చట్టాలు–2023 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సిటీ ట్రైనింగ్ సెంటర్ (సిటీసీ)లో 500 మంది సిటీ అర్ముడ్ రిజర్వ్ పోలీస్ అధికారులు, సిబ్బందికి వారం రోజులపాటు శిక్షణ ఇచ్చారు. BNS, BNSS, BSA చట్టాల ముఖ్య నిబంధనలు, కేసుల నమోదు, దర్యాప్తు, సాక్ష్యాల సేకరణ, డిజిటల్ సాక్ష్యాలు, బాధితుల హక్కులు, అరెస్టు–రిమాండ్, కోర్టు విచారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిటీసీ ఏసీపీ హరినాద్ బాబు, ఆర్ఐ నాగుల్ మీరా పాల్గొన్నారు.

కొత్త క్రిమినల్ చట్టాలపై పట్టు ఉండాలి: సీపీ సునీల్ దత్