Wednesday, 23 September 2026
  • Home  
  • కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
- ఎన్ టి ఆర్ జిల్లా

కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.165.73 కోట్లు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. తాజాగా రూ.25 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు గారు వర్చువల్ గా శంకుస్థాపన. తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, పార్కులు, వీధి దీపాలకు భారీగా నిధులు. ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, 22/09/2026. కొండపల్లి మున్సిపాలిటీలో పట్టణ మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి హెచ్.ఎ.ఎం. విధానంలో సుమారు రూ.25 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు వర్చువల్ విధానంలో ఈ పనులకు శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. కొండపల్లి అనుమోలు కన్వెన్షన్ హాల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్.ఎ.ఎం) విధానం ద్వారా రోడ్లు, డివైడర్లు, పార్కులు, వీధి దీపాల అభివృద్ధికి తాజాగా రూ.25 కోట్లు మంజూరు చేయగా, వీటిని కొండపల్లి మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణానికి రూ.3.35 కోట్లు, 13.403 మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.16.61 కోట్లు, మున్సిపల్ కార్యాలయం వద్ద పార్కు అభివృద్ధికి రూ.53.72 లక్షలు, రివర్ పార్క్, ఫెర్రీ ఘాట్ పార్కు అభివృద్ధికి రూ.3.38 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో వివిధ పథకాలు, ప్రభుత్వ నిధుల ద్వారా మొత్తం రూ.165.73 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు వివరించారు. వీటిలో కొన్ని పనులు ఇప్పటికే జరుగుతుండగా, మరికొన్ని టెండర్, పాలనా అనుమతుల దశల్లో ఉన్నాయని తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీలో ప్రస్తుతం రూ.69.73 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని వసంత కృష్ణప్రసాద్ గారు తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద తాగునీటి సరఫరా, నీటి వనరుల పునరుద్ధరణకు రూ.62.61 కోట్లు కేటాయించగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్.బి.ఎం) 2.0 కింద ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు రూ.3.34 కోట్లు కేటాయించి పనులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు, డ్రెయిన్లు, పూడికతీత పనులకు రూ.3.78 కోట్లు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. మరో రూ.96 కోట్ల పనులు వివిధ దశల్లో… కొండపల్లి మున్సిపాలిటీలో భవిష్యత్ మౌలిక వసతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రూ.96 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యు.ఐ.డి.ఎఫ్) -3&4 కింద తాగునీటి సరఫరా, డ్రెయిన్ల నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయించి పాలనా అనుమతుల దశలో ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా అర్బన్ చాలెంజ్ ఫండ్ (యు.సి.ఎఫ్) ఫేజ్-II కింద డ్రెయిన్ల నిర్మాణానికి రూ.46 కోట్లు కేటాయించి పాలనా అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందని వసంత కృష్ణప్రసాద్ గారు వివరించారు. పట్టణ ప్రజల జీవన ప్రమాణాలే లక్ష్యం. కొండపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు తెలిపారు. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు వివిధ ఆర్థిక వనరుల ద్వారా సమీకరిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు, టెండర్ మరియు పాలనా అనుమతుల దశలో ఉన్న పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రూ.25 కోట్ల విలువైన హెచ్.ఎ.ఎం ఎం పనులకు ప్రధాని మోడీ గారి ఆశీస్సులతో శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారాయణ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.165.73 కోట్లు.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

తాజాగా రూ.25 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు గారు వర్చువల్ గా శంకుస్థాపన.

తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, పార్కులు, వీధి దీపాలకు భారీగా నిధులు.

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, 22/09/2026.

కొండపల్లి మున్సిపాలిటీలో పట్టణ మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు తెలిపారు.

కొండపల్లి మున్సిపాలిటీలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి హెచ్.ఎ.ఎం. విధానంలో సుమారు రూ.25 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు వర్చువల్ విధానంలో ఈ పనులకు శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు.

కొండపల్లి అనుమోలు కన్వెన్షన్ హాల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్.ఎ.ఎం) విధానం ద్వారా రోడ్లు, డివైడర్లు, పార్కులు, వీధి దీపాల అభివృద్ధికి తాజాగా రూ.25 కోట్లు మంజూరు చేయగా, వీటిని కొండపల్లి మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణానికి రూ.3.35 కోట్లు, 13.403 మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.16.61 కోట్లు, మున్సిపల్ కార్యాలయం వద్ద పార్కు అభివృద్ధికి రూ.53.72 లక్షలు, రివర్ పార్క్, ఫెర్రీ ఘాట్ పార్కు అభివృద్ధికి రూ.3.38 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు తెలిపారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

కొండపల్లి మున్సిపాలిటీలో వివిధ పథకాలు, ప్రభుత్వ నిధుల ద్వారా మొత్తం రూ.165.73 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు వివరించారు. వీటిలో కొన్ని పనులు ఇప్పటికే జరుగుతుండగా, మరికొన్ని టెండర్, పాలనా అనుమతుల దశల్లో ఉన్నాయని తెలిపారు.

కొండపల్లి మున్సిపాలిటీలో ప్రస్తుతం రూ.69.73 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని వసంత కృష్ణప్రసాద్ గారు తెలిపారు.

అమృత్ 2.0 పథకం కింద తాగునీటి సరఫరా, నీటి వనరుల పునరుద్ధరణకు రూ.62.61 కోట్లు కేటాయించగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్.బి.ఎం) 2.0 కింద ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు రూ.3.34 కోట్లు కేటాయించి పనులు చేపట్టినట్లు తెలిపారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు, డ్రెయిన్లు, పూడికతీత పనులకు రూ.3.78 కోట్లు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

మరో రూ.96 కోట్ల పనులు వివిధ దశల్లో…

కొండపల్లి మున్సిపాలిటీలో భవిష్యత్ మౌలిక వసతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రూ.96 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యు.ఐ.డి.ఎఫ్) -3&4 కింద తాగునీటి సరఫరా, డ్రెయిన్ల నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయించి పాలనా అనుమతుల దశలో ఉన్నాయని చెప్పారు.

అదేవిధంగా అర్బన్ చాలెంజ్ ఫండ్ (యు.సి.ఎఫ్) ఫేజ్-II కింద డ్రెయిన్ల నిర్మాణానికి రూ.46 కోట్లు కేటాయించి పాలనా అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందని వసంత కృష్ణప్రసాద్ గారు వివరించారు.

పట్టణ ప్రజల జీవన ప్రమాణాలే లక్ష్యం.

కొండపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు తెలిపారు. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు వివిధ ఆర్థిక వనరుల ద్వారా సమీకరిస్తున్నట్లు వివరించారు.

ఇప్పటికే ప్రారంభమైన పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు, టెండర్ మరియు పాలనా అనుమతుల దశలో ఉన్న పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రూ.25 కోట్ల విలువైన హెచ్.ఎ.ఎం ఎం పనులకు ప్రధాని మోడీ గారి ఆశీస్సులతో శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారాయణ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.