కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అసెంబ్లీ సమావేశాలను గాలికి వదిలేసి, ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజల ఓట్లతో గెలిచి అసెంబ్లీకి వెళ్లిన ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలపై చర్చించాల్సింది పోయి, అసెంబ్లీ ముట్టడి, ఆందోళనలు, పరస్పర దూషణలు, ఆరోపణలు–ప్రత్యారోపణలతో సభను రాజకీయ రణరంగంగా మార్చడం సిగ్గుచేటని అన్నారు.రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, పేదలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిపై సమగ్రంగా చర్చించి పరిష్కారాలు చూపాల్సిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను పక్కనపెడుతున్నాయని అన్నారు.
ఇదే పరిస్థితి నర్సంపేటలో కూడా కనిపిస్తోంది. నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత ఘటన, దాని చుట్టూ జరుగుతున్న ధర్నాలు, ఆందోళనలు, పరస్పర విమర్శల కారణంగా నర్సంపేట రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.
నర్సంపేటలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి, నిరుద్యోగం, రైతుల సమస్యలు, పట్టణ అభివృద్ధి వంటి అనేక సమస్యలు ప్రజలను వేధిస్తున్నా వాటిపై మాట్లాడాల్సిన నాయకులు ఒకరినొకరు దూషించుకోవడంలోనే కాలం గడుపుతున్నారని విమర్శించారు.
విగ్రహాల చుట్టూ రాజకీయాలు చేయడం, ధర్నాలు చేయడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల నర్సంపేట ప్రజల సమస్యలు పరిష్కారం కావు. నర్సంపేట ప్రజలకు కావాల్సింది రాజకీయ రచ్చ కాదు.. అభివృద్ధి, మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాలు, మెరుగైన వైద్యం, నాణ్యమైన రోడ్లు, తాగునీరు మరియు ప్రజలకు జవాబుదారీ పాలన అని ఆయన అన్నారు.మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సేవలను గౌరవించే విధంగా, నర్సంపేటలోని వివిధ పార్టీల నాయకులతో చర్చించి, అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని, పట్టణంలో ఒక పెద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా నర్సంపేట గౌరవం, చరిత్ర, ప్రముఖుల సేవలను గౌరవించే విధంగా అందరూ కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీ అనేది రాజకీయ కుస్తీ పట్టే వేదిక కాదు.. ప్రజల భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకునే ప్రజాస్వామ్య వేదిక. అలాగే నర్సంపేట రాజకీయాలు కూడా వ్యక్తిగత దూషణలు, విగ్రహాల చుట్టూ వివాదాలు, ధర్నాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై సాగాలి.కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ డ్రామాలను పక్కనపెట్టి, ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపాలని, నర్సంపేట అభివృద్ధిపై చిత్తశుద్ధితో పనిచేయాలని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే ఇలాంటి రాజకీయాలకు తగిన సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో…బిజెపి ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ జూలూరు రోజా రాణి ,బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డపల్లి నరసింహా రాములు, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, నల్లబెల్లి అధ్యక్షులు తడుక వినయ్,మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు,బిజెపి నియోజకవర్గ నాయకులు జూలూరు మనీష్ గౌడ్,జిల్లా కిసాన్ మోర్చా జిల్లా నాయకులు శీలం సత్యనారాయణ,బచ్చు వెంకన్న, సీనియర్ నాయకులు కుంభం కోమల్ రెడ్డి,యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి రాము,పట్టణ నాయకులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, పొనుగోటి రవీంద్ర చారి పట్టణ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కాంగ్రెస్–బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలతో ప్రజా సమస్యలు పక్కదారి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అసెంబ్లీ సమావేశాలను గాలికి వదిలేసి, ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజల ఓట్లతో గెలిచి అసెంబ్లీకి వెళ్లిన ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలపై చర్చించాల్సింది పోయి, అసెంబ్లీ ముట్టడి, ఆందోళనలు, పరస్పర దూషణలు, ఆరోపణలు–ప్రత్యారోపణలతో సభను రాజకీయ రణరంగంగా మార్చడం సిగ్గుచేటని అన్నారు.రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, పేదలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిపై సమగ్రంగా చర్చించి పరిష్కారాలు చూపాల్సిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను పక్కనపెడుతున్నాయని అన్నారు. ఇదే పరిస్థితి నర్సంపేటలో కూడా కనిపిస్తోంది. నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత ఘటన, దాని చుట్టూ జరుగుతున్న ధర్నాలు, ఆందోళనలు, పరస్పర విమర్శల కారణంగా నర్సంపేట రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. నర్సంపేటలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి, నిరుద్యోగం, రైతుల సమస్యలు, పట్టణ అభివృద్ధి వంటి అనేక సమస్యలు ప్రజలను వేధిస్తున్నా వాటిపై మాట్లాడాల్సిన నాయకులు ఒకరినొకరు దూషించుకోవడంలోనే కాలం గడుపుతున్నారని విమర్శించారు. విగ్రహాల చుట్టూ రాజకీయాలు చేయడం, ధర్నాలు చేయడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల నర్సంపేట ప్రజల సమస్యలు పరిష్కారం కావు. నర్సంపేట ప్రజలకు కావాల్సింది రాజకీయ రచ్చ కాదు.. అభివృద్ధి, మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాలు, మెరుగైన వైద్యం, నాణ్యమైన రోడ్లు, తాగునీరు మరియు ప్రజలకు జవాబుదారీ పాలన అని ఆయన అన్నారు.మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సేవలను గౌరవించే విధంగా, నర్సంపేటలోని వివిధ పార్టీల నాయకులతో చర్చించి, అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని, పట్టణంలో ఒక పెద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా నర్సంపేట గౌరవం, చరిత్ర, ప్రముఖుల సేవలను గౌరవించే విధంగా అందరూ కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ అనేది రాజకీయ కుస్తీ పట్టే వేదిక కాదు.. ప్రజల భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకునే ప్రజాస్వామ్య వేదిక. అలాగే నర్సంపేట రాజకీయాలు కూడా వ్యక్తిగత దూషణలు, విగ్రహాల చుట్టూ వివాదాలు, ధర్నాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై సాగాలి.కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ డ్రామాలను పక్కనపెట్టి, ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపాలని, నర్సంపేట అభివృద్ధిపై చిత్తశుద్ధితో పనిచేయాలని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే ఇలాంటి రాజకీయాలకు తగిన సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో…బిజెపి ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ జూలూరు రోజా రాణి ,బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డపల్లి నరసింహా రాములు, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, నల్లబెల్లి అధ్యక్షులు తడుక వినయ్,మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు,బిజెపి నియోజకవర్గ నాయకులు జూలూరు మనీష్ గౌడ్,జిల్లా కిసాన్ మోర్చా జిల్లా నాయకులు శీలం సత్యనారాయణ,బచ్చు వెంకన్న, సీనియర్ నాయకులు కుంభం కోమల్ రెడ్డి,యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి రాము,పట్టణ నాయకులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, పొనుగోటి రవీంద్ర చారి పట్టణ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

