జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో ఉదయం అకస్మాత్తుగా నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా చీకటిపడింది. ఉదయం సమయంలోనే దట్టమైన మేఘాలతో వెలుతురు తగ్గి సాయంత్రం వాతావరణం తలపించింది. ఆ వెంటనే ఈదురుగాలులతో కూడిన వర్షం దంచి కొట్టింది. ఈ అకస్మాత్తు వాన ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్న పంటలకు జీవం పోసి, పొలాలను పచ్చదనంతో కళకళలాడేలా చేయడంతో రైతన్నల మొఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.



