Wednesday, 20 May 2026
  • Home  
  • కమిలిన నూనెతో టిఫిన్లు: వారం రోజుల నూనెతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం*
- ఖమ్మం

కమిలిన నూనెతో టిఫిన్లు: వారం రోజుల నూనెతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం*

*కమిలిన నూనెతో టిఫిన్లు: వారం రోజుల నూనెతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం* *క్యాన్సర్ కారకాలుగా మారిన వాడిన నూనె – ఫుడ్ సేఫ్టీ నిబంధనలు గాలికి* ఏన్కూరు: ఏన్కూరు మండలంలో పలు టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ బండ్లు లాభాల కోసం కక్కుర్తిపడి ఒకసారి వాడిన నూనెను వారం రోజుల పాటు మళ్లీ మళ్లీ వేడి చేసి వాడుతున్నాయి. దీంతో పూరీలు, వడలు, బజ్జీలు తినే ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. “ఒకసారి వేయించిన నూనె నల్లగా, మందంగా అయిపోతుంది. దాన్ని పారబోయకుండా ప్రతిరోజూ కొత్త నూనె కలిపి మళ్లీ వాడుతున్నారు. కొందరైతే వారం పైనే వాడుతున్నారు” అని మండల ప్రజలు తెలిపారు. *వైద్యులు ఏం చెబుతున్నారు?* “నూనెను పదే పదే వేడి చేస్తే ‘ట్రాన్స్ ఫ్యాట్స్’, ‘అక్రిలమైడ్’ అనే విషపూరిత రసాయనాలు తయారవుతాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు, లివర్ డ్యామేజ్, అల్సర్‌కు కారణం అవుతాయి. వారం రోజుల నూనె అంటే స్లో పాయిజన్ తిన్నట్టే” అని ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. అయినా టిఫిన్ సెంటర్ల యాజమాన్యాలకు ఎటువంటి భయం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు మరి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారులు కరువయ్యారు అని కుల సంఘాల నాయకులు చెప్తున్నారు *ఫ్ ఎస్ ఎస్ ఏ ఐ నిబంధన ఏం చెబుతోంది?* ఫుడ్ సేఫ్టీ అండ్ ఫ్ ఎస్ ఎస్ ఏ ఐ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టిపిసి 25% దాటిన నూనెను వెంటనే పారబోయ్యాలి వాడిన నూనెను ఫిల్టర్ చేసి, గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయాలి. నల్లగా మారిన, నురగ వచ్చిన, దుర్వాసన వచ్చే నూనెను పూర్తిగా నిషేధించారు. కానీ ఏన్కూరు మండలంలో 80% టిఫిన్ బండ్లలో ఈ నిబంధనలు పాటించడం లేదు “కొందరు నిర్వాహకులు వాడిన నూనెను లీటర్ రూ.20 కి అక్రమంగా రోడ్ సైడ్ పకోడీ బండ్లకు, సబ్బుల కంపెనీలకు అమ్ముతున్నారు. అది కూడా నేరమే” వారి లాభాలు చూసుకుంటున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు “వాడిన నూనె మళ్లీ వాడుతూ పట్టుబడితే ఫ్ ఎస్ ఎస్ ఏ ఐ చట్టం సెక్షన్ 59 ప్రకారం రూ.5 లక్షల వరకు జరిమానా, 6 నెలల జైలు శిక్ష పడుతుంది. లైసెన్స్ కూడా రద్దు అవుతుంది ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని గాలికి వదిలేసిన టిఫిన్ సెంటర్ల యాజమాన్యాలు ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి హోటళ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

*కమిలిన నూనెతో టిఫిన్లు: వారం రోజుల నూనెతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం*

*క్యాన్సర్ కారకాలుగా మారిన వాడిన నూనె – ఫుడ్ సేఫ్టీ నిబంధనలు గాలికి*

ఏన్కూరు:

ఏన్కూరు మండలంలో పలు టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ బండ్లు లాభాల కోసం కక్కుర్తిపడి ఒకసారి వాడిన నూనెను వారం రోజుల పాటు మళ్లీ మళ్లీ వేడి చేసి వాడుతున్నాయి. దీంతో పూరీలు, వడలు, బజ్జీలు తినే ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు.

“ఒకసారి వేయించిన నూనె నల్లగా, మందంగా అయిపోతుంది. దాన్ని పారబోయకుండా ప్రతిరోజూ కొత్త నూనె కలిపి మళ్లీ వాడుతున్నారు. కొందరైతే వారం పైనే వాడుతున్నారు” అని మండల ప్రజలు తెలిపారు.

*వైద్యులు ఏం చెబుతున్నారు?*

“నూనెను పదే పదే వేడి చేస్తే ‘ట్రాన్స్ ఫ్యాట్స్’, ‘అక్రిలమైడ్’ అనే విషపూరిత రసాయనాలు తయారవుతాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు, లివర్ డ్యామేజ్, అల్సర్‌కు కారణం అవుతాయి. వారం రోజుల నూనె అంటే స్లో పాయిజన్ తిన్నట్టే” అని ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.
అయినా టిఫిన్ సెంటర్ల యాజమాన్యాలకు ఎటువంటి భయం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు మరి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారులు కరువయ్యారు అని కుల సంఘాల నాయకులు చెప్తున్నారు

*ఫ్ ఎస్ ఎస్ ఏ ఐ నిబంధన ఏం చెబుతోంది?*

ఫుడ్ సేఫ్టీ అండ్ ఫ్ ఎస్ ఎస్ ఏ ఐ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
టిపిసి 25% దాటిన నూనెను వెంటనే
పారబోయ్యాలి
వాడిన నూనెను ఫిల్టర్ చేసి, గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయాలి.
నల్లగా మారిన, నురగ వచ్చిన, దుర్వాసన వచ్చే నూనెను పూర్తిగా నిషేధించారు.
కానీ ఏన్కూరు మండలంలో 80% టిఫిన్ బండ్లలో ఈ నిబంధనలు పాటించడం లేదు

“కొందరు నిర్వాహకులు వాడిన నూనెను లీటర్ రూ.20 కి అక్రమంగా రోడ్ సైడ్ పకోడీ బండ్లకు, సబ్బుల కంపెనీలకు అమ్ముతున్నారు. అది కూడా నేరమే” వారి లాభాలు చూసుకుంటున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు

“వాడిన నూనె మళ్లీ వాడుతూ పట్టుబడితే ఫ్ ఎస్ ఎస్ ఏ ఐ చట్టం సెక్షన్ 59 ప్రకారం రూ.5 లక్షల వరకు జరిమానా, 6 నెలల జైలు శిక్ష పడుతుంది. లైసెన్స్ కూడా రద్దు అవుతుంది ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని గాలికి వదిలేసిన టిఫిన్ సెంటర్ల యాజమాన్యాలు

ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి హోటళ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.