ఖమ్మం: ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు రేఖ సత్యనారాయణ యాదవ్ ప్రకటించారు. మొత్తం 20 మందితో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓబీసీ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఓబీసీల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తామని రేఖ సత్యనారాయణ యాదవ్ స్పష్టం చేశారు.



