వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
“బాల్య వివాహాలపై మేడమ్స్ చెప్పినవి బాగా అర్థమయ్యాయి. బాగా చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెప్పిన మాటలు బాగున్నాయి” అని గన్నెల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల పదో తరగతి విద్యార్థిని అరుణ తెలిపింది. పాఠశాలలో నిర్వహించిన బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో అల్లూరి జిల్లా జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ దంపతులను చూసి, తాను కూడా వారిలా ఐఏఎస్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పింది. కళాకారిణి గరివిడి లక్ష్మి, అరకులోయ సీడీపీఓ లక్ష్మీలావణ్య, గన్నెల పీహెచ్సీ వైద్యులు డా. జే.కే. నాయుడు, డా. ప్రియాంక, వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Uploaded Video:
వార్తా మూలాలు
- Punnami Reportingఇతర మూలం