Friday, 1 May 2026
  • Home  
  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు అండ – ఇంటివద్దే పంపిణీ
- తిరుపతి

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు అండ – ఇంటివద్దే పంపిణీ

శ్రీకాళహస్తి, మే 01 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిపట్టణంలో తెదేపా నాయకులు నిరుపేద కుటుంబాలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం గొప్ప తోడ్పాటుగా నిలుస్తోందని టీడీపీ సీనియర్ నాయకులు లక్కమనేని మధుబాబు, డాక్టర్ ఎం. ఉమేష్ రావు సంయుక్తంగా పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 18వ వార్డు జయరాం రావు వీధిలో నిర్వహించిన “పేదల సేవలో – ప్రజా ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఉదయం 10 గంటలకే 75 శాతం పైగా పెన్షన్ పంపిణీ పూర్తి కావడం అధికారుల, ప్రజాప్రతినిధుల సమన్వయానికి నిదర్శనమని అన్నారు. ఈ నెల పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ. 2,720.67 కోట్లు విడుదల చేసిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇప్పటివరకు మొత్తం రూ. 63,158 కోట్లు పేదలకు పెన్షన్ల రూపంలో అందించబడినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ జి. దశరథాచారి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, మాజీ కౌన్సిలర్ షేక్ మహబూబ్ బాషా, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ కోట చంద్రశేఖర్, బూత్ కన్వీనర్ గాజుల భగత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.