Friday, 29 May 2026
  • Home  
  • ఎన్టీఆర్ ప్రజా పాలన చిరస్మరణీయం- శ్రీ కాళహస్తి టీడీపీ శ్రేణి నాయకులు
- తిరుపతి

ఎన్టీఆర్ ప్రజా పాలన చిరస్మరణీయం- శ్రీ కాళహస్తి టీడీపీ శ్రేణి నాయకులు

శ్రీ కాళహస్తి, మే 28, (పున్నమి న్యూస్) : పేద ప్రజల ఆత్మగౌరవాన్ని పాలనలో ప్రతిబింబింపజేసిన మహానేత, “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతంతో ప్రజారంజక పాలన అందించిన యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన తెలుగు జాతికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి వంటి పురాణ పాత్రలను తెరపై జీవించి చూపించిన నట మహానటుడు ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో దేవుడిలా స్థానం సంపాదించుకున్న అరుదైన వ్యక్తిత్వం ఆయనదేనని కొనియాడారు. సినీ రంగంలో అపార ఖ్యాతి గడించినప్పటికీ ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించి సామాన్య ప్రజల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. రెండు రూపాయల కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులు, పేదల సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఒకే జీవితంలో కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సంపాదించి, ప్రజానాయకుడిగా చరిత్రలో నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మిన్నల్ రవి, గెడిపూడి విజయకుమార్, డా.యం. ఉమేష్ రావు, వజ్రం కిషోర్, కాసరం రమేష్, నాగమల్లి దుర్గాప్రసాద్, వినయ్, కె.వి.ప్రతాప్, కోట చంద్రశేఖర్, పూల శేఖర్, రెడ్డి, రాకేష్, కృష్ణమూర్తి, రమేష్, సులేమాన్, శివ, శంకరయ్య, కిరణ్, గోపీ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.