*రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను వినతి పత్రంలో సమర్పిస్తున్న రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా::తేది.13/06.2026)*
శనివారం నాడు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు – తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు *శానమోని నర్సిములు* గారి నేతృత్వంలో… గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారిని కలిసి ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయులు అనేక రకాల సర్వీసు సమస్యలు ముఖ్యంగా ఎంప్లాయ్ ఆరోగ్య పథకం, టెట్ తదితర సర్వీస్ అంశాలపై స్పందించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరారు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కారం కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేయగా.. మనం చెప్పిన సమస్యలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తను పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ (సర్వీసెస్) గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీ *కె.సత్యనారాయణ రెడ్డి* గారిని.. అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ శ్రీమతి *వెంకట నరసమ్మ* గారిని మరియు మరో జాయింట్ డైరెక్టర్ శ్రీమతి *ఉషారాణి* గారిని కలిసి సంఘపక్షాన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.
కార్యక్రమంలో.. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి *అమీర్ పాషా* హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు *ఇశ్రాయేలు* ప్రధాన కార్యదర్శి *నర్సింగ్ రావు* నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు *బి.ఇ. విజయ్ కుమార్* వికారాబాద్ జిల్లా అధ్యక్షులు *డాక్టర్.మానుపురి వెంకటేశ్వర్లు* నాయకులు మహేశ్వరరావు,దస్తగిరి తదితరులు పాల్గొన్నారు


