Friday, 29 May 2026
  • Home  
  • ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవడానికి పోరాటానికి సిద్ధం కావాలి
- అన్నమయ్య

ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవడానికి పోరాటానికి సిద్ధం కావాలి

తిరుపతి జిల్లా చిట్వేలు మండలం కోట అగ్రహారం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి కూలీలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఎం. జయరామయ్య, చిట్వేలు మండల నాయకులు తిప్పన ప్రసాద్, బీకేఎంయు ఓబుళవారిపల్లి మండల నాయకులు శివకుమార్ వర్మరాజు మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఉపాధి హక్కును కాపాడాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న జి-రామ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు రోజురోజుకు తగ్గిపోతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకమే వేలాది పేద కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నాయని విమర్శించారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయల కోత విధించడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ కూలీల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ పనుల్లో అమలు చేస్తున్న రెండు పూటల ఫేస్ యాప్ విధానం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా హాజరు నమోదు కాకపోవడం వల్ల వేతనాలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పని ప్రదేశాల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం, త్రాగునీరు, గుడారాలు, మెడికల్ కిట్లు అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వం అందించాల్సిన పలుగు, పార, తట్టలు వంటి పనిముట్లు కూడా సరఫరా చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకు సరైన రక్షణ చర్యలు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.అలాగే ఉపాధి హామీ కూలీలకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం వల్ల కుటుంబ పోషణ కూడా కష్టసాధ్యమైందని తెలిపారు. ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులు ప్రతి గ్రామంలో ఐక్యంగా ముందుకు వచ్చి తమ హక్కుల సాధన కోసం పోరాటాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శివకుమార్ వర్మరాజు, సుబ్రహ్మణ్యం, వీరయ్య, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు

తిరుపతి జిల్లా చిట్వేలు మండలం కోట అగ్రహారం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి కూలీలతో సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఎం. జయరామయ్య, చిట్వేలు మండల నాయకులు తిప్పన ప్రసాద్, బీకేఎంయు ఓబుళవారిపల్లి మండల నాయకులు శివకుమార్ వర్మరాజు మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఉపాధి హక్కును కాపాడాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న జి-రామ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు రోజురోజుకు తగ్గిపోతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకమే వేలాది పేద కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నాయని విమర్శించారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయల కోత విధించడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ కూలీల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ పనుల్లో అమలు చేస్తున్న రెండు పూటల ఫేస్ యాప్ విధానం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా హాజరు నమోదు కాకపోవడం వల్ల వేతనాలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పని ప్రదేశాల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం, త్రాగునీరు, గుడారాలు, మెడికల్ కిట్లు అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వం అందించాల్సిన పలుగు, పార, తట్టలు వంటి పనిముట్లు కూడా సరఫరా చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకు సరైన రక్షణ చర్యలు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.అలాగే ఉపాధి హామీ కూలీలకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం వల్ల కుటుంబ పోషణ కూడా కష్టసాధ్యమైందని తెలిపారు. ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులు ప్రతి గ్రామంలో ఐక్యంగా ముందుకు వచ్చి తమ హక్కుల సాధన కోసం పోరాటాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శివకుమార్ వర్మరాజు, సుబ్రహ్మణ్యం, వీరయ్య, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.