ఉదయగిరి: పట్టణంలోని బీసీ కాలనీ సమీపంలో ఉన్న సాయిబాబా ఆలయ పెయింటింగ్ పనుల కోసం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు తనయుడు కార్తిక్ శుక్రవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా కార్తిక్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఆలయ పెయింటింగ్ పనులకు విరాళం అందించిన కార్తిక్‌కు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ఉదయగిరి సాయిబాబా ఆలయానికి రూ.లక్ష విరాళం