Thursday, 24 September 2026
  • Home  
  • ఉత్తమ ఉపాధ్యాయురాలు షేక్ జరీనాకు ఘన సన్మానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉత్తమ ఉపాధ్యాయురాలు షేక్ జరీనాకు ఘన సన్మానం

ఉదయగిరి మండల 2026 ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన పుల్లాయపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు షేక్ జరీనాను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గాజులపల్లి సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అందించిన సన్మాన ఫొటో ఫ్రేమ్‌ను ఉపాధ్యాయులు, విద్యార్థులు జరీనాకు కానుకగా అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి ఆమె అందించిన సేవలను గ్రామస్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కొనియాడారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరీనా మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసిన విద్యాశాఖకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.