Monday, 7 September 2026
  • Home  
  • *ఈ నెలాఖరు కల్లా చెత్త నిర్వహణ ప్లాంట్ అందుబాటులోకి తేవాలి.*
- తిరుపతి

*ఈ నెలాఖరు కల్లా చెత్త నిర్వహణ ప్లాంట్ అందుబాటులోకి తేవాలి.*

*సెప్టెంబర్ లోపు రామాపురం డంపింగ్ యార్డు చెత్త నిర్వహణ పూర్తి కావాలి .* *సుడిగాలి పర్యటన చేసిన కమిషనర్ ఎం. జయకృష్ణ.* రామచంద్రపురం ఆగస్టు 19పున్నమి ప్రతినిధి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూకివాకం వద్ద చేపట్టిన *చెత్త నిర్వహణ ప్లాంట్* (ప్రాసెసింగ్ ప్లాంట్) నిర్మాణ పనులను నాణ్యతతో ఈ నెలాఖరు లోపు పూర్తి చెయ్ అందుబాటులోకి తేవాలని, పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను హెచ్చరించారు. బుధవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ సుడిగాలి పర్యటన చేశారు. నగరంలో పారిశుధ్థ్య పనులతో పాటు తూకివాకంలో నిర్మిస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణ పనులను, తడి, పొడి చెత్త, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ల పనితీరు, రామాపురం డంపింగ్ యార్డు వద్ద జరుగుతున్న చెత్త నిర్వహణ పనులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ముందుగా తూకివాకం వద్ద జరుగుతున్న వేస్ట్ ప్రాసెసింగ్ (చెత్త నిర్వహణ)ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల ఆలస్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయాల్సిన మేర పనులు జరగడం లేదని, పనిచేసే వారి సంఖ్య పెంచి, యంత్రాల వాడకాన్ని పెంచి ఇచ్చిన గడువు లోపు పనులు పూర్తి చేసి, ప్లాంట్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్ట్ పనుల నిర్మాణంలో ఆలస్యం చేస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తడి, పొడి చెత్త ప్లాంట్లు, గ్యాస్ ఉత్పత్తి ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ పనితీరును పరిశీలించారు. భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి లోతట్టు ప్రాంతాల్లో ఎత్తు పెంచడం, నూతన రోడ్లు ఏర్పాటు వంటి వాటిలో వినియోగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రామాపురం వద్ద గల డంపింగ్ యార్దును పరిశీలించారు. ప్రతి రోజు ఎంత చెత్త నిర్వహణ చేస్తున్నారు, ఎందుకు వినియోగిస్తున్నారు, ఇంకా ఎంత చెత్త ఉంది, ఇప్పటి లోపు పూర్తి అవుతుందనే విషయాలను తెలుసుకుని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని రోజుల్లో జరగాల్సినంత పని జరగక పోవడం పట్ల నిర్వాహక సిబ్బందిని మందలించారు. ఇప్పటి వరకు ఉన్న మొత్తం చెత్త సెప్టెంబర్ మూడవ వారానికల్లా నిర్వహణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ లో ఏరోజుకారోజు చేసిన పనిని రికార్డ్ చేసి సంబంధిత అధికారులను అప్పగించాలని నిర్వాహకులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.రమణ, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.

*సెప్టెంబర్ లోపు రామాపురం డంపింగ్ యార్డు చెత్త నిర్వహణ పూర్తి కావాలి .*

*సుడిగాలి పర్యటన చేసిన కమిషనర్ ఎం. జయకృష్ణ.*

రామచంద్రపురం ఆగస్టు 19పున్నమి ప్రతినిధి

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూకివాకం వద్ద చేపట్టిన *చెత్త నిర్వహణ ప్లాంట్* (ప్రాసెసింగ్ ప్లాంట్) నిర్మాణ పనులను నాణ్యతతో ఈ నెలాఖరు లోపు పూర్తి చెయ్ అందుబాటులోకి తేవాలని, పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను హెచ్చరించారు. బుధవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ సుడిగాలి పర్యటన చేశారు. నగరంలో పారిశుధ్థ్య పనులతో పాటు తూకివాకంలో నిర్మిస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణ పనులను, తడి, పొడి చెత్త, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ల పనితీరు, రామాపురం డంపింగ్ యార్డు వద్ద జరుగుతున్న చెత్త నిర్వహణ పనులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ముందుగా తూకివాకం వద్ద జరుగుతున్న వేస్ట్ ప్రాసెసింగ్ (చెత్త నిర్వహణ)ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల ఆలస్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయాల్సిన మేర పనులు జరగడం లేదని, పనిచేసే వారి సంఖ్య పెంచి, యంత్రాల వాడకాన్ని పెంచి ఇచ్చిన గడువు లోపు పనులు పూర్తి చేసి, ప్లాంట్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్ట్ పనుల నిర్మాణంలో ఆలస్యం చేస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తడి, పొడి చెత్త ప్లాంట్లు, గ్యాస్ ఉత్పత్తి ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ పనితీరును పరిశీలించారు. భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి లోతట్టు ప్రాంతాల్లో ఎత్తు పెంచడం, నూతన రోడ్లు ఏర్పాటు వంటి వాటిలో వినియోగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రామాపురం వద్ద గల డంపింగ్ యార్దును పరిశీలించారు. ప్రతి రోజు ఎంత చెత్త నిర్వహణ చేస్తున్నారు, ఎందుకు వినియోగిస్తున్నారు, ఇంకా ఎంత చెత్త ఉంది, ఇప్పటి లోపు పూర్తి అవుతుందనే విషయాలను తెలుసుకుని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని రోజుల్లో జరగాల్సినంత పని జరగక పోవడం పట్ల నిర్వాహక సిబ్బందిని మందలించారు. ఇప్పటి వరకు ఉన్న మొత్తం చెత్త సెప్టెంబర్ మూడవ వారానికల్లా నిర్వహణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ లో ఏరోజుకారోజు చేసిన పనిని రికార్డ్ చేసి సంబంధిత అధికారులను అప్పగించాలని నిర్వాహకులను ఆదేశించారు.
కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.రమణ, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.