బిక్కవోలు, జూలై 31 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి శుక్రవారం ఉదయం బిక్కవోలు గ్రామంలో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరిగి ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వివరించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని మనోజ్‌రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




