Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ఆదిలక్ష్మి కి న్యాయం జరగాలి…తూర్పుగోదావరి జిల్లా బి.జె.పి అధ్యక్షలు పిక్కీ నాగేంద్ర.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆదిలక్ష్మి కి న్యాయం జరగాలి…తూర్పుగోదావరి జిల్లా బి.జె.పి అధ్యక్షలు పిక్కీ నాగేంద్ర.

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇంటి ఆదిలక్ష్మి అనే మహిళను ఆటో డ్రైవర్ షేక్ యాకుబ్ గోదావరి గట్టు స్మశానవాటికలోకి ఆకస్మాత్తుగా ఆటోను తీసుకునివెళ్ళి ఆ మహిళపై అత్యాచారం చేసి చంపేసి వంటిమీద…
  • దుర్మార్గుడు షేక్ యాకుబ్ ను పట్టుకున్న పోలీసులు రిమాండ్ కి పంపించారు.
  • బిజెపి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, తాళ్లపూడి మండల అధ్యక్షులు ఇండుగుల రామకృష్ణ పార్టీ క్యాడర్ తో కలిసి బాధితురాలి స్వగ్రామం పట్టిసీమ వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇంటి ఆదిలక్ష్మి అనే మహిళను ఆటో డ్రైవర్ షేక్ యాకుబ్ గోదావరి గట్టు స్మశానవాటికలోకి ఆకస్మాత్తుగా ఆటోను తీసుకునివెళ్ళి ఆ మహిళపై అత్యాచారం చేసి చంపేసి వంటిమీద ఉన్న బంగారం తీసేసుకుని శవాన్ని గోదావరిలో పడేశాడు.ఏడు రోజులు అవుతున్నా శవం దొరకలేదు. దుర్మార్గుడు షేక్ యాకుబ్ ను పట్టుకున్న పోలీసులు రిమాండ్ కి పంపించారు.
బిజెపి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, తాళ్లపూడి మండల అధ్యక్షులు ఇండుగుల రామకృష్ణ పార్టీ క్యాడర్ తో కలిసి బాధితురాలి స్వగ్రామం పట్టిసీమ వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కుమార్తె బిందు విలపించిన తీరు మమ్మల్ని కంటతడి పెట్టించింది. వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా అమ్మాయికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకుండా చూడాలని ఆవేదన తెలిజేశారు.
ఆదిలక్ష్మి కుమార్తె బిందు మాట్లాడుతూ మా అమ్మని చంపిన షేక్ యాకుబ్ ని ఎన్కౌంటర్ చేయాలని, తనకి కూడా రక్షణ కల్పించాలని కోరారు
పట్టిసీమ గోదావరి గట్టు పై నిరసన
అక్కడున్న మహిళలు సమాజంలో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అందుకు పోలీసులు అధికారులు ప్రజాప్రతినిధులు మరింత కఠిన చర్యలను నేరస్థులపై తీసుకోవాలని గోదావరి గట్టు పైకి వచ్చి రోడ్డును స్తంభింప చేశారు. అమాయకురాలు ఆదిలక్ష్మి అన్యాయంగా చంపేసిన షేక్ యాకోబును ఉరి తీయాలని, ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. న్యాయం కోసం మహిళలు చేస్తున్న శాంతియుత నిరసనకు బిజెపి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర సంఘీభావం తెలియజేశారు. వారితో కలిసి ఆ శాంతియుత నిరసనలో కూర్చున్నారు.
6 గంటల పాటు జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో 2000 మందికి పైగా పాల్గొన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీస్ అధికారులు నిరసన విరమించుకోవాలని అక్కడున్న గ్రామ ప్రజలను & బిజెపి జిల్లా అధ్యక్షులు నాగేంద్రని కోరగా.. ఆదిలక్ష్మికి న్యాయం జరగాలి, ఆదిలక్ష్మి కుమార్తెకి రక్షణ కల్పించాలి, ఆదిలక్ష్మి శవాన్ని త్వరితగతిన కనుగొనాలి, షేక్ యకూబు మర్రెవ్వరి జోలికి వెళ్లకుండా కఠినంగా శిక్షించాలని తెలియజేసి నిరసనను విరమించారు.
ఈ సందర్భంగా బిజెపి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ. మొన్న వైష్ణవి, నిన్న సాజిద్ ఖాన్, ఇప్పుడు ఆదిలక్ష్మి.. ఇలా సమాజంలో ఆడవారి పై దాడి చేసి వారిని చిత్రహింసలకు గురిచేసి చంపేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం బాగా పనిచేస్తున్నప్పటికీ ఈ ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే నిందితులకు చట్టరీత్యా వేసేటువంటి శిక్షలు సరిపోవడంలేదని, తప్పు చేశాడని నిర్ధారణ జరిగిన వెంటనే తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షిస్తే సమాజంలో మరొకరు అలాంటి తప్పులు చేయాలని ఆలోచనలురావు. మహిళల పట్ల, బాలికల పట్ల ఘోరాలు చేసే వారికి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మార్కు ఏ విధంగా చూపిస్తారో.., అలాంటి మార్కు ఆంధ్రప్రదేశ్ లో కూడా చూపించాలని కోరారు. ఆదిలక్ష్మి కి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తూ, వారి కుమార్తె బిందు కి బిజెపి అండగా ఉంటుందని పిక్కి నాగేంద్ర అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పట్టిసీమ ప్రజలు, బిజెపి నాయకులు పిల్లలమరి మురళీకృష్ణ, తాడిమల్ల విజయవాణి, కరిబండి నాగరాజు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *