ఆటో, మోటార్ రంగ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి అన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో INTUC మోటార్ రంగ జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ ఆధ్వర్యంలో ఆటో మోటార్ వర్కర్స్ జేఏసీ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షానే నిలుస్తుందని తెలిపారు. ఆటో, మోటార్ రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.



