*ఆకేపాటి ఎస్టేట్ లో ఉచిత వివాహం*
రాజంపేట: నిరుపేద జంటకు ఆకేపాటి ఎస్టేట్ అండగా నిలిచింది.
హస్తవరం రెడ్డివారిపల్లికి చెందిన శేఖర్, మందపల్లికి చెందిన లక్ష్మీ ల వివాహాన్ని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాలతో ఆకేపాటి దేవాలయ సముదాయంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉచితంగా జరిపించారు.
అనంతరం వచ్చిన బంధుమిత్రులకు ఎమ్మెల్యే సతీమణి ఆకేపాటి జ్యోతి గారు ఎస్టేట్ లో అల్పాహారం ఏర్పాటు చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు.


