Friday, 25 September 2026
  • Home  
  • రైల్వే కోడూరులో ఏఐటీయూసీ రాజకీయ శిక్షణ
- తిరుపతి

రైల్వే కోడూరులో ఏఐటీయూసీ రాజకీయ శిక్షణ

రైల్వే కోడూరులో ఏఐటీయూసీ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి. హరినాథ్‌రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కార్మిక రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం వంటి అంశాలపై కార్మికులను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శిక్షణ పొందిన కార్యకర్తలు కార్మిక సమస్యలపై అవగాహన పెంచుకుని భవిష్యత్ పోరాటాల్లో కీలకంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఈ. మురళి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కే. రాధాకృష్ణ, జ్యోతి చిన్నయ్య, మదారాజు గంగాధర్, దాసరి జయచంద్ర చైతన్య, వై.ఎస్. మణి, కే.వై. రాజా, శివ, నాగేంద్ర, గోవిందస్వామి, నాగరాజమ్మ, జాన్ మురళి తదితరులు పాల్గొన్నారు.

రైల్వే కోడూరులో ఏఐటీయూసీ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి. హరినాథ్‌రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కార్మిక రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు.

కార్మిక హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం వంటి అంశాలపై కార్మికులను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శిక్షణ పొందిన కార్యకర్తలు కార్మిక సమస్యలపై అవగాహన పెంచుకుని భవిష్యత్ పోరాటాల్లో కీలకంగా పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఈ. మురళి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కే. రాధాకృష్ణ, జ్యోతి చిన్నయ్య, మదారాజు గంగాధర్, దాసరి జయచంద్ర చైతన్య, వై.ఎస్. మణి, కే.వై. రాజా, శివ, నాగేంద్ర, గోవిందస్వామి, నాగరాజమ్మ, జాన్ మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.