అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు ప్రారంభించింది. మున్సిపల్, పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ రెండో వారం నుంచి మున్సిపల్, పరిషత్ ఎన్నికలను నిర్వహించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం అక్టోబర్ రెండో వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సుమారు 40 రోజుల వ్యవధిలో విడతలవారీగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, సంబంధిత శాఖల అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు ప్రారంభించింది. మున్సిపల్, పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ రెండో వారం నుంచి మున్సిపల్, పరిషత్ ఎన్నికలను నిర్వహించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం అక్టోబర్ రెండో వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 40 రోజుల వ్యవధిలో విడతలవారీగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, సంబంధిత శాఖల అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

