కిర్లంపూడి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 28:
జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామం నర్సాపేటలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక మండపాన్ని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా సిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ, స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాడి చిన్న బుజ్జి, గంధం ప్రభాకర్, చిక్కాల కల్కిభగవాన్, ఆళ్ల నానాజీ, దాడి గోవిందు, బాబి, సిద్ధి వినాయక యూత్ సభ్యులు, జగపతినగరం గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


