అనారోగ్యంతో బాధపడుతున్న మిట్టపల్లి యాకయ్యకు పరామర్శ
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన బత్తిని శ్రీనివాస్ గౌడ్, వేములపల్లి ప్రకాశ్ రావు
ఖానాపూర్, నవంబర్ 20 (పున్నమి ప్రతినిధి): ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ గ్రామానికి చెందిన మిట్టపల్లి యాకయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నర్సంపేట ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్ రావు గురువారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా యాకయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మనోధైర్యం కల్పించారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆబోతు శ్రీలత అశోక్ యాదవ్, ఉపసర్పంచ్ గొడుగు రమయాకన్న, వల్లెపు శ్రీను, బుస అశోక్ యాదవ్, ఎండి మస్తాన్, నాగులు, మీరా, యాకన్న, డోలి సారయ్య, మల్లయ్య, నూనెల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
