బుధరావుపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం: సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి
బుధరావుపేట, నవంబర్ 19 (పున్నమి ప్రతినిధి): వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఎడెల్లి రమేష్‌కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గురువారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లగౌడ్, ఖానాపూర్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు చెడిపాక ఉపేందర్, సొసైటీ డైరెక్టర్ చెడిపాక రజిత, చిన్న యాకయ్య, సీనియర్ నాయకులు రామస్వామి, సాంబయ్య, ఎల్లయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
