ఖానాపురం పున్నమి ప్రతినిధి:బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్కు అందజేత
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో రూ.17 వేల ఆర్థిక సాయం
ఖానాపురం మండలంలోని దబీర్పేట గ్రామానికి చెందిన బానోత్ శోభన్కు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక సహకారంతో మంజూరైన రూ.17,000 సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సురేష్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో సీఎం సహాయనిధి ఎంతో భరోసా కల్పిస్తోందని తెలిపారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కుమార్, కోమ్యాలు, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.
