చిట్వేల్ మండలంలోని చిట్వేల్-2 సెక్టార్ కేకే వడ్డీపల్లి అంగన్వాడీ కేంద్రంలో శనివారం సేవా సంకల్ప అభియాన్ ఉత్సవాలు, అంగన్వాడీ ఉత్సవం, పోషణ్ మాసం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ సురేఖారాణి మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమని తెలిపారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను చేర్చాలని తల్లులకు సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్ ఉత్సవాలు