ఎల్బీనగర్, వనస్థలిపురం, ఎన్జీవోస్ కాలనీ, సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో రామసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. గత 16 సంవత్సరాలుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను నిరంతరంగా నిర్వహిస్తూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా 3,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 21న లడ్డు వేలం పాట నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లడ్డు వేలం పాటను విజయవంతం చేయాలని వారు కోరారు.
ఉత్సవాల ఏర్పాట్లను రామసేన యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. రాజు ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు నరేష్, ఆంజనేయులు, రమేష్, ప్రభాత్, చంటి, తులసి, ఖాజా, మహేష్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.



