నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న సోమవారం పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల నిల్వ, వినియోగాన్ని పరిశీలించి, నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యాపారులు నిబంధనలు పాటించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. తనిఖీల్లో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు విక్రమ్, శానిటేషన్ సూపర్వైజర్లు లక్ష్మీనారాయణ, శివప్రసాద్‌రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌పై కమిషనర్ తనిఖీలు