అనపర్తి, సెప్టెంబరు 26 (పున్నమి ప్రతినిధి): దొంతమూరులో వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన టీడీపీ నాయకులు ఉద్దండరావు శ్రీనివాస్, దుగ్గన్న త్రిమూర్తులు, దుగ్గన్న పుల్లయ్యలను అనపర్తి ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన, నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఘటనలో కానిస్టేబుల్ శ్రీధర్ వ్యవహారంపైనా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఘటనను మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి వక్రీకరిస్తున్నారని నల్లమిల్లి ఆరోపించారు.







