*తాండ్రలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. లబ్ధిదారులకు కార్డులు అందజేసిన కూచాడి శ్రీహరిరావు*
మామడ మండలంలోని తాండ్ర గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు హాజరై అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా కూచాడి శ్రీహరిరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాపాలనను కొనసాగిస్తోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ రేషన్ సరుకులు సులభంగా అందడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు వీలు కలుగుతుందని శ్రీహరిరావు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ప్రజల సంక్షేమం, పేద కుటుంబాలకు అండగా నిలవడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో అర్హులైన కుటుంబాలకు ఆహార భద్రత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి గారు, తాండ్ర గ్రామ సర్పంచ్ కస్తూరి భాస్కర్ గారు, తాండ్ర ఉప సర్పంచ్ రాథోడ్ సూషేన్ ,గయద్ పల్లి గ్రామ సర్పంచ్ ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాథోడ్ సంతోష్ గారు, మొండిగుట్ట గ్రామ సర్పంచ్ భీమేష్ గారు, వస్తాపూర్ సర్పంచ్ భూమారెడ్డి,బురుగుపల్లి సర్పంచి భూమన్న,గొండుగూడ సర్పంచు భీంరావు, మాజీ ఎంపీపీ జైసింగ్,మాజీ ఎంపీటీసీ అన్వర్ కిషన్రావుపేట్ సర్పంచ్ రాథోడ్ వసంత్,పొన్కల్ గంగారెడ్డి,కైరి రాకేష్ గౌడ్,బాదావత్ రమేష్,సాయగౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, లబ్ధిదారులు పాల్గొన్నారు.


