ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్‌కు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్ల బ్యాగ్ కనిపించకుండా పోయినట్లు సమాచారం. కర్ణాటకకు చెందిన కలెక్టర్ తల్లిదండ్రులు ఇటీవల ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా తమ కుమారుడికి సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్లను బ్యాగులో తీసుకొచ్చారు. అయితే ఆ బ్యాగ్ మిస్సయినట్లు గుర్తించారు. దీనిపై కలెక్టర్ పేరిట శుక్రవారం ఖమ్మం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు మిస్సింగ్‌పై వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.


