జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో ( జూన్ పున్నమి)
కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుల అఘాయిత్యానికి గురైన ఎరుకుల మహిళను శాసన మండలి సభ్యులు కుంభా రవిబాబు,వైఎస్ఆర్ సీపీ ఎస్ టి సెల్ రాష్ట్ర అధ్యక్షులు గుండా సురేంద్రల మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలతో కలిసి పరామర్శించారు.గతంలో ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా, శాసనసభ్యునిగా పనిచేసి, ప్రస్తుతం శాసనమండలి సభ్యునిగా ఉన్న కుంభా రవిబాబు ఎస్టీ సెల్ మహిళా నేతలతో కలిసి పరామర్శించి,బాధిత మహిళకు ధైర్యం చెప్పారు
రాష్ట్రంలో మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని కూటమి నాయకులే మహిళలపై అఘాయిత్యాలు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపించారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళల వైపు చూడాలంటే భయపడేవారని
జగన్మోహన్ రెడ్డి దిశా యాప్ తెచ్చి, మహిళలకు రక్షణ కల్పించారని పేర్కొన్నారు.
చంద్రబాబు ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్లినా ఒకటే మాట చెబుతున్నారు, ఎవరైనా మహిళల జోలికి వచ్చినా, మహిళల మీద చేయి వేసినా.. ఆ రోజే వాళ్లకు ఆఖరి రోజు అవుతుంది” అంటూ నిన్న కూడా గూడూరులో చెప్పారని
ఒక ఎస్టీ మహిళకు తీవ్ర అన్యాయం జరిగిందని పదే పదే ప్రశ్నిస్తున్నా, ఈ కేసు జరిగి ఇన్ని రోజులవుతున్నా కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని
కనీసం నిందితులను అరెస్ట్ చేయలేదు, దీని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆరోపించారు.గిరిజన మహిళ కేసులో పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో అందరం చూశాం, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని గిరిజన మహిళ కేసును ఏదో ఒక రకంగా నీరుగార్చాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని,నిందితులను కాపాడటానికి, బాధితులనే రివర్స్‌లో నిందితులుగా చిత్రీకరించడానికి దొంగ సర్టిఫికెట్లు సృష్టించారని ఆరోపించారు.
బాధితులను రకరకాలుగా బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి ఈ కేసు ముందుకు వెళ్లకుండా చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారని జన్మతః ఏదైతే కులం తో పుడతామో, అదే కులం కొనసాగుతుందే తప్ప, మారమంటే మారదని
సదరు వ్యక్తులు అసలు ‘ఎస్టీ’ వర్గానికి చెందినవారా కాదా అనే విషయంపై స్థానిక తహాశీల్దార్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బుక్ డిమాండ్ చేశారు.
గిరిజన మహిళకు జరిగిన అన్యాయంపై ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు.సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆ మహిళతో నేతలు స్పష్టం చేశారు.

కావలి కచ్చేరి మిట్ట లో యమ్ యల్ సి కుంభా.. న్యాయం జరిగే వరకూ పోరు.
జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో ( జూన్ పున్నమి) కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుల అఘాయిత్యానికి గురైన ఎరుకుల మహిళను శాసన మండలి సభ్యులు కుంభా రవిబాబు,వైఎస్ఆర్ సీపీ ఎస్ టి సెల్ రాష్ట్ర అధ్యక్షులు గుండా సురేంద్రల మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలతో కలిసి పరామర్శించారు.గతంలో ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా, శాసనసభ్యునిగా పనిచేసి, ప్రస్తుతం శాసనమండలి సభ్యునిగా ఉన్న కుంభా రవిబాబు ఎస్టీ సెల్ మహిళా నేతలతో కలిసి పరామర్శించి,బాధిత మహిళకు ధైర్యం చెప్పారు రాష్ట్రంలో మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని కూటమి నాయకులే మహిళలపై అఘాయిత్యాలు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపించారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళల వైపు చూడాలంటే భయపడేవారని జగన్మోహన్ రెడ్డి దిశా యాప్ తెచ్చి, మహిళలకు రక్షణ కల్పించారని పేర్కొన్నారు. చంద్రబాబు ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్లినా ఒకటే మాట చెబుతున్నారు, ఎవరైనా మహిళల జోలికి వచ్చినా, మహిళల మీద చేయి వేసినా.. ఆ రోజే వాళ్లకు ఆఖరి రోజు అవుతుంది” అంటూ నిన్న కూడా గూడూరులో చెప్పారని ఒక ఎస్టీ మహిళకు తీవ్ర అన్యాయం జరిగిందని పదే పదే ప్రశ్నిస్తున్నా, ఈ కేసు జరిగి ఇన్ని రోజులవుతున్నా కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కనీసం నిందితులను అరెస్ట్ చేయలేదు, దీని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆరోపించారు.గిరిజన మహిళ కేసులో పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో అందరం చూశాం, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని గిరిజన మహిళ కేసును ఏదో ఒక రకంగా నీరుగార్చాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని,నిందితులను కాపాడటానికి, బాధితులనే రివర్స్‌లో నిందితులుగా చిత్రీకరించడానికి దొంగ సర్టిఫికెట్లు సృష్టించారని ఆరోపించారు. బాధితులను రకరకాలుగా బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి ఈ కేసు ముందుకు వెళ్లకుండా చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారని జన్మతః ఏదైతే కులం తో పుడతామో, అదే కులం కొనసాగుతుందే తప్ప, మారమంటే మారదని సదరు వ్యక్తులు అసలు ‘ఎస్టీ’ వర్గానికి చెందినవారా కాదా అనే విషయంపై స్థానిక తహాశీల్దార్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బుక్ డిమాండ్ చేశారు. గిరిజన మహిళకు జరిగిన అన్యాయంపై ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు.సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆ మహిళతో నేతలు స్పష్టం చేశారు.

