Saturday, 4 July 2026
  • Home  
  • పేదలకు కొండంత అండ సీఎంఆర్ఎఫ్: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేదలకు కొండంత అండ సీఎంఆర్ఎఫ్: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి!

పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరు: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరులోని కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి 26వ విడత చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 20 మంది లబ్ధిదారులకు రూ.8.38 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మొత్తం 921 చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వాటి ద్వారా రూ.9.32 కోట్ల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి కొనసాగిస్తామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.

పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.

కోవూరు: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరులోని కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి 26వ విడత చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 20 మంది లబ్ధిదారులకు రూ.8.38 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మొత్తం 921 చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వాటి ద్వారా రూ.9.32 కోట్ల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి కొనసాగిస్తామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.