గ్రామ ప్రజలు, గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్న సమారాధన
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)
యలమంచిలి : ఏటికొప్పాక గ్రామంలోని పెద్ద వినాయకుడి ఆలయం వద్ద బుధవారం అన్న సమారాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, గణేష్ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు తరలివచ్చారు.
వినాయకుడి దర్శనం అనంతరం భక్తులకు నిర్వాహకులు ప్రేమాభిమానాలతో అన్నప్రసాదాన్ని వడ్డించారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా గ్రామస్థులు కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గణేష్ యూత్ సభ్యులు సేవాభావంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
భక్తి, సేవాభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ అన్న సమారాధన కార్యక్రమం ఏటికొప్పాకలో ఆధ్యాత్మిక సందడిని నింపింది.


