అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. కేశవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావం, లక్ష్యాలను వివరించారు. ముఖ్యఅతిథి ఆర్. హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే సేవా దృక్పథాన్ని అలవర్చుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ పీవోలు డాక్టర్ జి. సుధీర్, వై. విజయలక్ష్మి, బి. లచ్చన్న 2026–27 కార్యక్రమాలు, ‘స్వయం సమృద్ధ భారతదేశం కోసం యువత’ థీమ్ ప్రాధాన్యతను వివరించారు. ఉత్తమ 30 మంది వాలంటీర్లకు సర్టిఫికెట్లు, పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ముఖ్యఅతిథిని, ప్రిన్సిపాల్‌ను ఎన్ఎస్ఎస్ పీవోలు సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

అరకు: ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవం