అంబేద్కర్ కోనసీమ జిల్లా | మామిడికుదురు మండలం
పాశర్లపూడి కైకాలపేటలోని వై జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గెడ్డం రాజేష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NH-216 నుంచి R&B రోడ్డుకు కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత ప్రమాదాలు పెరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
R&B రోడ్డుకు ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
NH-216పై ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
వాహనదారులకు ముందస్తు సమాచారం అందేలా హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలి
మామిడికుదురు, గెద్దాడ, చింతలపల్లి, శివకోటి ప్రాంతాల్లో R&B–NH కనెక్టివిటీ వద్ద కూడా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Uploaded Video:

