
రాసాల బిక్షం కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్మరిపెడ: మండలంలోని నీలికుర్తి గ్రామానికి చెందిన రాసాల బిక్షం గారు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు పరామర్శించారు.ఈ సందర్భంగా బిక్షం గారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

