Monday, 28 September 2026
  • Home  
  • ప్రజా వాణి అర్జీలపై ప్రత్యేక ద్రుష్టి సారించాలి -జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
- జనగాం

ప్రజా వాణి అర్జీలపై ప్రత్యేక ద్రుష్టి సారించాలి -జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

*ప్ర‌జావాణి అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి — జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా* ప్ర‌జావాణిలో వివిధ స‌మ‌స్య‌లతో వచ్చే ప్ర‌జ‌ల అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని *జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా* అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వ‌హించిన ప్ర‌జావాణిలో *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా *(371)* అర్జీలను *క‌లెక్ట‌ర్* స్వీక‌రించారు. వచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను సంబంధిత శాఖ‌ల అధికారుల‌కు కేటాయిస్తూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారాలను వేగవంతం చేయాలని, పెండింగ్ లో లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీ, వార్డు నంబర్ 11కు చెందిన కందగట్ల మధుసుదన్, తమ వీధిలో డ్రైనేజ్ కాలువ, సీసీ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారని, కావుక మురుగు కాలువ, సీసీ రోడ్డు నిర్మాణం కొరకు మనవి చేస్తూ ద‌రఖాస్తు చేసుకున్నారు. తిడుగు గ్రామం, జఫర్గడ్ మండలానికి చెందిన వాసం వెంకటేశ్వర్లు, తమకు రెండు ఎకరాల ఎనిమిది గుంటల భూమి వంశపారపర్యంగా సంక్రమించినదని, ఆ భూమి ఇతరుల పేరున రెవెన్యూ రికార్డుల్లో వస్తోందని, దానిని తొలగించి, తమ పేరున నమోదు చేసి పట్టా పాసుబుక్కు, పహాణీలు ఇప్పించుట కోసం ద‌ర‌ఖాస్తు చేసియున్నారు. రామచంద్రాపురం గ్రామం, బచ్చన్నపేట మండలానికి చెందిన బండి వనజ, గతంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కొరకు దరఖాస్తును సమర్పించారని, ఆన్లైన్ పోర్టల్ లో నమోదు కాలేదని, తన దరఖాస్తును పరిశీలించి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆర్జీ ద్వారా కోరారు. వడిచెర్ల గ్రామం, లింగాల ఘనపురం మండలానికి చెందిన బొట్ల అనసూర్య, తనది పేద కుటుంబం అని, కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారని, భూమి జాగా ఏమీ లేదని, ఉన్న ఇల్లు శిథిలావస్థలో ఉందని, పాత ఇల్లు అని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరుతూ దరఖాస్తు అందించారు. సిద్ధెంకి గ్రామం, జనగామ మండలానికి చెందిన నీలగిరి భిక్షపతి, తన రెండు ఎకరాల ఐదు గుంటల భూమిని ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ విన‌తిప‌త్రం అందజేశారు. ఈ ప్ర‌జావాణిలో డీఆర్డీఓ భాస్కర్, జనగామ మునిసిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, సీపీఓ చిన కోట్యా నాయక్, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

*ప్ర‌జావాణి అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి
— జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా*
ప్ర‌జావాణిలో వివిధ స‌మ‌స్య‌లతో వచ్చే ప్ర‌జ‌ల అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని *జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా* అధికారుల‌ను ఆదేశించారు.
సోమ‌వారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వ‌హించిన ప్ర‌జావాణిలో *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు.
ఈ సంద‌ర్భంగా *(371)* అర్జీలను *క‌లెక్ట‌ర్* స్వీక‌రించారు. వచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను సంబంధిత శాఖ‌ల అధికారుల‌కు కేటాయిస్తూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారాలను వేగవంతం చేయాలని, పెండింగ్ లో లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.
ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి..
జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీ, వార్డు నంబర్ 11కు చెందిన కందగట్ల మధుసుదన్, తమ వీధిలో డ్రైనేజ్ కాలువ, సీసీ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారని, కావుక మురుగు కాలువ, సీసీ రోడ్డు నిర్మాణం కొరకు మనవి చేస్తూ ద‌రఖాస్తు చేసుకున్నారు.
తిడుగు గ్రామం, జఫర్గడ్ మండలానికి చెందిన వాసం వెంకటేశ్వర్లు, తమకు రెండు ఎకరాల ఎనిమిది గుంటల భూమి వంశపారపర్యంగా సంక్రమించినదని, ఆ భూమి ఇతరుల పేరున రెవెన్యూ రికార్డుల్లో వస్తోందని, దానిని తొలగించి, తమ పేరున నమోదు చేసి పట్టా పాసుబుక్కు, పహాణీలు ఇప్పించుట కోసం ద‌ర‌ఖాస్తు చేసియున్నారు.
రామచంద్రాపురం గ్రామం, బచ్చన్నపేట మండలానికి చెందిన బండి వనజ, గతంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కొరకు దరఖాస్తును సమర్పించారని, ఆన్లైన్ పోర్టల్ లో నమోదు కాలేదని, తన దరఖాస్తును పరిశీలించి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆర్జీ ద్వారా కోరారు.
వడిచెర్ల గ్రామం, లింగాల ఘనపురం మండలానికి చెందిన బొట్ల అనసూర్య, తనది పేద కుటుంబం అని, కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారని, భూమి జాగా ఏమీ లేదని, ఉన్న ఇల్లు శిథిలావస్థలో ఉందని, పాత ఇల్లు అని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరుతూ దరఖాస్తు అందించారు.

సిద్ధెంకి గ్రామం, జనగామ మండలానికి చెందిన నీలగిరి భిక్షపతి, తన రెండు ఎకరాల ఐదు గుంటల భూమిని ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ విన‌తిప‌త్రం అందజేశారు.
ఈ ప్ర‌జావాణిలో డీఆర్డీఓ భాస్కర్, జనగామ మునిసిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, సీపీఓ చిన కోట్యా నాయక్, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.