పున్నమి న్యూస్ కొవ్వూరు:తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరు రోడ్డులో తుఫాన్ ప్రభావంతో నీటమునిగిన రహదారి, కాలువలను కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తుఫాన్ కారణంగా రహదారిపై నిలిచిన నీరు, కాలువల పరిస్థితిని పరిశీలించి, నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా, నిలిచిన నీటిని త్వరితగతిన తొలగించేలా చర్యలు చేపట్టాలని* అధికారులను ఆదేశించారు.
అనంతరం చెరువులో చేపడుతున్న గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాన్ని పరిశీలించారు. చెరువులో నీటి ప్రవాహం సక్రమంగా ఉండేలా గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించి, అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
అలాగే తిరుమల స్కూల్, చాగల్లు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించి, తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులను పరిశీలించారు. ప్రజలకు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి, అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలనిఎమ్మెల్యే సూచించారు.



