పున్నమి దినపత్రిక న్యూస్
🚨 *ఓటర్లకు అత్యవసర హెచ్చరిక – ఇంకా 12 రోజులే!* 🗳️
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. మీకు అందిన **ఎన్యూమరేషన్ ఫారం (Enumeration Form)**ను పూర్తి చేసి జూలై 14లోపు మీ ప్రాంత **BLO (Booth Level Officer)**కు తప్పనిసరిగా అందజేయాలి.
ఇప్పటివరకు రాష్ట్రంలోని 4.16 కోట్ల ఓటర్లలో కేవలం 1.56 కోట్ల మంది (37.66%) మాత్రమే నింపిన ఫారాలను తిరిగి సమర్పించారు.
గడువులోగా ఫారం ఇవ్వకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయే అవకాశం ఉంది. దీంతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.

