Thursday, 6 August 2026
  • Home  
  • గార్లఒడ్డు ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమం* సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్
- ఖమ్మం

గార్లఒడ్డు ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమం* సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్

*గార్లఒడ్డు ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమం* సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్ జూన్ 15 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: గార్లఒడ్డు, గ్రామపంచాయతీలో గ్రామ అభివృద్ధి, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా గార్లఒడ్డు గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. సోమవారం పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్త, పొదలను గ్రామపంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. తరగతి గదుల ముందు, గేటు వద్ద పేరుకున్న దుమ్ము, చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. పిల్లలు పరిశుభ్రమైన వాతావరణంలో చదువుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని పంచాయతీ సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్ తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. “స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ తెలంగాణ” లో భాగంగా ప్రతి వారం పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి అధికారులు పేర్కొన్నారు. పరిశుభ్రత పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామని, భవిష్యత్తు తరాలకు మంచి సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

*గార్లఒడ్డు ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమం*

సర్పంచ్
భూక్యా నర్సి లాలు నాయక్

జూన్ 15 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు:
గార్లఒడ్డు, గ్రామపంచాయతీలో
గ్రామ అభివృద్ధి, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా గార్లఒడ్డు గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

సోమవారం పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్త, పొదలను గ్రామపంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. తరగతి గదుల ముందు, గేటు వద్ద పేరుకున్న దుమ్ము, చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు.

పిల్లలు పరిశుభ్రమైన వాతావరణంలో చదువుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని పంచాయతీ సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్ తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.

“స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ తెలంగాణ” లో భాగంగా ప్రతి వారం పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి అధికారులు పేర్కొన్నారు. పరిశుభ్రత పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామని, భవిష్యత్తు తరాలకు మంచి సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.