శ్రీ కాళహస్తి, జులై 04 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని బీపీ అగ్రహారానికి చెందిన సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సి. ఆనంద్ కుమారుడు హర్షవర్ధన్ ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించి రికార్డు సృష్టించాడు. ఈ అద్భుత ప్రతిభకు గుర్తింపుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి హర్షవర్ధన్‌ను స్వయంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దామోదరం రెడ్డి మాట్లాడుతూ, తాను చదువుకున్న విద్యాసంస్థలకు, కన్నతల్లిదండ్రులకు మైలురాయి లాంటి ఘనతను తెచ్చిపెట్టిన హర్షవర్ధన్‌ను తోటి విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో కూడిన చదువు ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందని, నేటి యువత నిరంతరం తమ ఉజ్వల భవిష్యత్తుపై కాంక్షతో చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, దిలీప్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంటర్ స్టేట్ సెకండ్ ర్యాంకర్ హర్షవర్ధన్‌కు కాంగ్రెస్ నేత ఘన సన్మానం