పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )
అనకాపల్లి: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని ఏఐడీడబ్ల్యూఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. సావిత్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
శ్రీశక్తి పథకం అమలుతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సులు, సిబ్బందిని పెంచాల్సి ఉండగా బస్సుల సంఖ్య తగ్గడం వల్ల రద్దీ అధికమవుతోందని తెలిపారు. బస్‌స్టాప్‌ల వద్ద బస్సులు తప్పనిసరిగా ఆపడంతో పాటు మహిళా ప్రయాణికులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మహిళల పట్ల దురుసుగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు బి. ప్రభావతి, జిల్లా అధ్యక్షురాలు పి. మాణిక్యం, కార్యదర్శి డి.డి. వరలక్ష్మి, జాయింట్ సెక్రటరీలు సిహెచ్. మంగతాయారు, ఆర్. లక్ష్మి, నారాయణమ్మ, వాణి సుభాషిణి, ట్రెజరర్ కె.వి.ఎస్. సూర్య తదితరులు పాల్గొన్నారు.

