పున్నమి ప్రతిని ధి సెప్టెంబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా
చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు గడ్డం తిరుపతిరెడ్డి రాఘవరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ధైర్య సాహసాలతో పాల్గొన్నారు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరు జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో తాడును ఉపయోగించి జైలు గోడ దూకి సాహసోపేతంగా తప్పించుకున్నారు అనంతరం తిరిగి పోరాటంలో చేరారు పోరాటం అనంతరం తమ భూముల్లో కొంత భాగాన్ని పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారు



